మోడీ కేబినెట్ ఆమోదించిన అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లుపై ఓవైసీ రియాక్షన్ ; ఓటు బ్యాంకు కోసమే...
మోడీ కేబినెట్ ఆమోదించిన అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు
మోడీ కేబినెట్ ఆమోదించిన అగ్రవర్ణాల రిజర్వేషన్లబిల్లుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు... ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలౌతున్నాయి. అగ్రవర్గాల ఓట్లను దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు... కానీ రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేమని అభిప్రాపడ్డారు. దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు దాన్నీ ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం సిగ్గుచేటు కేంద్రం తీరును అసదుద్దీన్ తప్పుబట్టారు