Asian Games 2023 Medal Winners Meet With CM Jagan: ఇటీవల చైనాలోని హాంగ్జౌ వేదిక జరిగిన ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి తదితరులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. తాము సాధించిన పతకాలను సీఎం జగన్‌కు క్రీడాకారులు చూపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
 
>> మైనేని సాకేత్‌ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఆసియా‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వ నగదు బహుమతి రూ.20 లక్షలు
>> వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్‌ జిల్లా, ఆర్చరీ, ఆసియా 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేత, రూ.90 లక్షలు ప్రభుత్వం అందజేసింది
>> కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఆసియా‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, రూ.20 లక్షలు ప్రభుత్వం అందజేసింది
>> ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేత, రూ.50 లక్షలు నగదు బహుమతి ప్రభుత్వం అందజేసింది
>> యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఆసియా గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, రూ.20 లక్షలు ప్రభుత్వం అందజేసింది
>> బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఆసియా గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ.20 లక్షలు.
>> కోనేరు హంపి, ఎన్టీఆర్‌ జిల్లా, చెస్, ఆసియా గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, రూ. 20 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది
>> బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఆసియా గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేత రూ.30 లక్షలు ప్రభుత్వం నగదు బహుమతి అందజేసింది.  


ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ.4.29 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగా.. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి  13 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఇందులో  8 మంది మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు.


Also Read: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..


Also Read: Lava Blaze Pro 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook