AP Rajbhavan: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం..దూరం దూరంగా జగన్, చంద్రబాబు..!
AP Rajbhavan: ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు పలువురు పాల్గొన్నారు.
AP Rajbhavan: విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం కొనసాగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రొగ్రామ్‌లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. వీరితోపాటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకే కార్యక్రమంలో సీఎం జగన్, చంద్రబాబు పాల్గొనడం ఇదే తొలిసారి. ఇరువురు పాల్గొనడంపై ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
ఐతే సీఎం జగన్, చంద్రబాబు ఎదురుపడలేదు. ఇరువురు వేర్వేరు కూర్చిండి పోయారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ దంపతులు వేదిక దగ్గర్లో ఉండిపోయారు. చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కేశినేని నానితో కలిసి వేరే చోట ఉన్నారు. ఎట్ హోం కార్యక్రమం ముగియగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ వేదికపైకి వెళ్లారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇరువురి భేటీపై టీడీపీ, వైసీపీలో జోరుగా చర్చ జరిగింది. సీఎం జగన్, చంద్రబాబు మాట్లాడుకుంటారని..పలు అంశాలు చర్చకు వస్తాయని ఊహాగానాలు వినిపించాయి. ఐతే అవేవి జరగలేదు. సీఎం జగన్, చంద్రబాబు ఎవరికి వారుగా ఉండిపోయారు. గత కొంతకాలంగా ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. ఈక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారానికి తెరలేపింది.
Also read:Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!
Also read:Rohit Sharma: ఆసియా కప్‌లో జయసూర్య, సచిన్ రికార్డు బద్ధలు కానుందా..? రోహిత్ జోరు కొనసాగిస్తాడా..?
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook