Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!

Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో టీకా రాబోతోంది. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. ఈక్రమంలో మూడో దశ ట్రయల్స్ విజయవంతమైంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 15, 2022, 04:41 PM IST
  • త్వరలో అందుబాటులోకి మరో టీకా
  • భారత్ బయోటెక్‌ నుంచి వ్యాక్సిన్
  • ట్రయల్స్ విజయవంతం
Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!

Bharat Biotech: కరోనా నియంత్రణలో భాగంగా భారత్‌ బయోటెక్ మరో టీకాను తయారు చేసింది. ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ బీబీవీ154 మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైంది. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది. ఈమేరకు భారత్ బయోటెక్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీబీవీ154 టీకా పూర్తిగా సురక్షితమైనదని..వ్యాధి నిరోధక శక్తిని సమర్థంగా పెంచుతుందని తెలిపింది.

టీకా తయారులో కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్ వెక్టార్ సాయంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్‌ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో తయారు చేసినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్‌ను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రయోగ ఫలితాల వివరాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేశారు. పేద, మధ్య తరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్ష్యంతో దీనికి తయారు చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో టీకా అభివృద్ధి, ప్రయోగాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించినట్లు తెలిపింది. బీబీవీ154 వ్యాక్సిన్‌ను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలు చేశారు. బీబీవీ154ను 2-8 డిగ్రీల సెల్సియస్ దగ్గర భద్ర పర్చవచ్చని..సులువుగా తరలించవచ్చని సదరు సంస్థ వెల్లడించింది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైందని చెప్పడం సంతోషంగా ఉందని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ఓ ప్రకటనలో తెలిపారు. 

Also read:Pawan Kalyan: ఒక్క అవకాశం ఇవ్వండి..అధికారంలోకి రాగానే అందరీ లెక్కలు తేలుస్తామన్న పవన్ కళ్యాణ్..!

Also read:Jio 5G Phone: జియో నుంచి 5జీ ఫోన్..ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News