AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సంస్థల సర్వేలు షాక్ ఇస్తున్నాయి.
AP Elections 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వే ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎవరు గెలుస్తారు, అధికారం ఎవరిదనే విషయంలో వివిధ రకాల అంచనాలున్నాయి. ఈ క్రమంలో వెలువడుతున్న సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. అధికారం ఎవరిదో స్పష్టత ఇచ్చేసింది. ఈ సంస్థ దశలవారీగా సర్వేలు చేస్తోంది. తాజాగా మరోసారి సర్వే ఈ నెల 16 వరకూ నిర్వహించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 48.75 శాతం మద్దతు లభిస్తే, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి 45.50 శాతం మద్దతు ఉందని ఆత్మసాక్షి గ్రూప్ అంచనా వేసింది. మరో 2.5 శాతం మంది తటస్థంగా ఉన్నారని తేల్చింది.
ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 97-118 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి 54-62 స్థానాలు రావచ్చని తెలిపింది. మరో 24 స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని తేల్చింది. ఈ 24 స్థానాల్లో 16 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత కనబరుస్తోందని వెల్లడించింది. ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేలో ఏ జిల్లాలో ఎన్ని సీట్లనేది తేల్చిచెప్పింది.
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 5, కూటమికి 3 స్థానాలు దక్కితే మరో 2 సీట్లలో పోటీ ఉంటుందని తెలిపింది. ఇక విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 7,స కూటమికి 2 స్థానాలు దక్కవచ్చు. విశాఖపట్నంలో వైసీపీకు 6, కూటమికి 6 స్థానాలు, మరో 3 స్థానాల్లో పోటీ ఉంటుందని సర్వే తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకు 9, కూటమికి 7, మూడు స్థానాల్లో హోరాహోరీ ఉంటుందని తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకు 8, కూటమికి 5, 2 స్థానాల్లో పోటీ ఉంటుందని తెలిపింది. కృష్ణా జిల్లాలో వైసీపీకు 10, కూటమికి 5, 1 స్థానంలో హోరాహోరీ పోటీ ఉంటుందని తెలిపింది. గుంటూరు జిల్లాలో వైసీపీకు 7, కూటమికి 8, రెండు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని తెలిపింది. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 5, కూటమికి 4, మూడు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని సర్వే తేల్చింది. నెల్లూరు జిల్లాలో వైసీపీకు 5, కూటమికి 4 స్థానాలు రావచ్చని తెలుస్తోంది.
ఇక కడప జిల్లాలో వైసీపీకు 8, కూటమికి 1 స్థానం రావచ్చని అంచనా వేసింది. కర్నూలులో వైసీపీ 10, కూటమి 2 స్థానాలు గెల్చుకుంటే మరో స్థానంలో పోటీ ఉంటుంది. అనంతపురంలో వైసీపీ 9, కూటమి 3 స్థానాల్లో గెలిస్తే మరో 2 స్థానాల్లో పోటీ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ 8 స్థానాల్లో కూటమి 4 స్థానాల్లో విజయం సాధించవచ్చు.
మొత్తంగా చూస్తే రాయలసీమ ప్రాంతంలో వైసీపీకు 35, కూటమికి 10 స్థానాలు దక్కనున్నాయి. మిగిలినవరి పోటీ ఉంటాయి. దక్షిణ కోస్తాలోని 55 స్థానాల్లో వైసీపీ 27, కూటమి 21 స్థానాలో గెలవవచ్చు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకు 17, కూటమికి 12 స్థానాలు దక్కవచ్చు. ఉత్తరాంధ్రలో వైసీపీకు 18, కూటమికి 11 స్థానాలు దక్కనున్నాయి.
Also read: Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook