Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు

Air Conditions: వేసవి వచ్చిందంటే చాలు కరెంటు బిల్లులు మోత మోగిస్తుంటాయి. నిరంతరం తిరిగే ఫ్యాన్లు, ఏసీల కారణంగా బిల్లు భారీగా వస్తుంటుంది. ఏసీలు వాడకుండా ఉండలేని పరిస్థితి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే విద్యుత్ బిల్లుల మోత ఉండదంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 16, 2024, 09:13 PM IST
Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు

Air Conditions: ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వడగాల్పులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీల వినియోగం పెరిగిపోతోంది. కొన్ని ఇళ్లలో అయితే ఏసీలు నిరంతరం ఆన్‌లోనే ఉంటున్నాయి. దాంతో భారీగా వస్తున్న కరెంటు బిల్లులు ఆందోళన కల్గిస్తున్నాయి. 

ఇటీవలి కాలంలో ఏసీల వినియోగం పట్టణాల్లోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరిగిపోతోంది. వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు. ఏసీలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లు తరచూ శుభ్రం చేయించాలి. దాంతో ఏసీ మోటార్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఏసీ ఫిల్టర్ శుభ్రంగా ఉంటే విద్యుత్ అవసరం తగ్గుతుంది. 

ఏసీలు ఆన్‌లో ఉన్నప్పుుడు ఇంట్లో కిటికీలు, తలుపులు మూసివేస్తే గది త్వరగా చల్లబడుతుంది. దాంతో కచ్చితంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఏసీలను ఎప్పుడూ 24 గంటలు వినియోగించకూడదు. దీనివల్ల ఏసీ పరికరాలు త్వరగా పాడవుతాయి. విద్యుత్ ఛార్జీలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఏసీలుంటే అన్నీ ఒకేసారి వినియోగించకుండా జాగ్రత్త పడాలి. 

ఏసీ ఉష్ణోగ్రతను పూర్తి కనిష్ట స్థాయిలో ఉంచకుండా మీడియం స్థాయిలో ఉంచాలి. అదే సమయంలో ఏసీలు కొనేటప్పుడే స్టార్ రేటింగ్ అధికంగా ఉండే ఏసీలు వినియోగించాల్సి ఉంటుంది. ఏసీ పాతబడితే మార్చడం మంచిది. లేకపోతే విద్యుత్ వినియోగం పెరుగుతుంటుంది. ఇంట్లో ఏసీ వినియోగించేటప్పుడు ఫ్యాన్ కనీస వేగంతో తిరిగేట్టు చూడాలి. దీనివల్ల కూలింగ్ మొత్తం గది అంతా ఆవహిస్తుంది. 

Also read: Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News