Babu Mohan: టిడిపి తీర్థం పుచ్చుకున్న స్టార్ కమెడియన్.. సొంతగూటికి మళ్ళీ!
Babu Mohan Joins TDP: తాజాగా జరిగిన పరిణామం బట్టి చూస్తే.. మాజీ మంత్రి, ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ సొంతగూటికి.. చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు.
Babu Mohan : స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు మోహన్, అటు సినిమాలలోనే కాదు ఇటు రాజకీయంగా కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు టిడిపిలో కొనసాగిన ఈయన , ఆ తర్వాత పార్టీ వీడారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ లోకి చేరినట్లు సమాచారం. తాజాగా తాను టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా గతంలో టిడిపిలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈయన అనంతరం పలు పార్టీలలో చేరి చివరికి సొంత గూటికి చేరుకున్నారు. ఇకపోతే తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు తమకు కలిసొచ్చే పార్టీలో చేరడానికి సిద్ధం అయిపోయారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరగా ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ వైపు కూడా కొంతమంది నేతలు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టిడిపిలోకి చేరగా ఇప్పుడు బాబు మోహన్ కూడా ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
Also Read: Gold News: ధన త్రయోదశి రోజు భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు బంగారం కొంటున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్
తాజాగా బాబు మోహన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈయన ఇప్పుడు మళ్లీ అక్కడికే వచ్చి చేరారు. టిడిపిని తెలంగాణలో బలోపేతం చేయడానికే ఇప్పుడు టిడిపిలో చేరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అడ్ హక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది ప్రభుత్వం.ఈ క్రమంలోనే టిడిపి సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ ఇప్పుడు ఆ పార్టీలో చేరినట్లు మీడియాతో ప్రకటించారు.
2024 - 2026 కు గానూ ఆయన సభ్యత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్టార్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న బాబు మోహన్ అటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పలు పార్టీలు సాధర ఆహ్వానం పలుకుతున్నాయి.
Also Read: Gold Delivery: బిగ్‌బాస్కెట్ బంపర్ ఆఫర్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి మీ ఇంటికే డెలివరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి