Sukhbir Singh:  గోల్డెన్‌ టెంపుల్‌లో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై కాల్పులు.. వీడియో దృశ్యాలు ఇవే..

Fire On Sukhbir Sing Badala Video Viral: పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్ బాదాల్‌పై నేడు గోల్డెన్ టెంపుల్ లో కాల్పులు జరిగాయి. ఈ శిరోమణి ఆకలి దళ్ పార్టీ నేత పై  ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. చారిత్రాత్మక గోల్డెన్‌ టెంపుల్‌ మరోసారి కాల్పుల శబ్దలు వినిపించాయి.

Written by - Renuka Godugu | Last Updated : Dec 4, 2024, 11:19 AM IST
Sukhbir Singh:  గోల్డెన్‌ టెంపుల్‌లో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై కాల్పులు.. వీడియో దృశ్యాలు ఇవే..

Fire On Sukhbir Sing Badala Video Viral:  గోల్డెన్ టెంపుల్ వద్ద సుఖ్‌బీర్‌ సింగ్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అతడిపై అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడు. వెంటనే చుట్టుముట్టు ఉన్న బాదల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయం వద్ద కుర్చీపై కూర్చొని కాపలాదారుగా పనిచేస్తున్నారు బాదల్‌. ఆ సమయంలో ఆ వృద్ధుడు జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌ సింగ్‌ పై కాల్పులు జరిపాడు.

విషయాన్ని వెంటనే గమనించిన సుఖ్‌బీర్ సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. ఈలోగా గాలిలో గన్‌ కూడా ఫైర్ జరిగింది. గోల్డెన్ టెంపుల్ పై బుల్లెట్ దూసుకు వెళ్ళింది. ఏమాత్రం అప్రమత్తత లేకున్నా సుఖ్‌బీర్‌ సింగ్‌ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. వెంటనే అప్రమత్తమై సుఖ్‌ బీర్ సింగ్ సిబ్బంది కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఆ వ్యక్తి గతంలో ఇంటర్నేషనల్ ఉగ్రముటాలో పనిచేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

 

 

 

 

నిందితుడి పేరు నరేన్‌ గా గుర్తించారు అతడు 1984 సమయంలో పాకిస్తాన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది .అక్రమ ఆయుధాల రవాణాలో కీలక వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలానికి తిరిగి భారత్ కి చేరారు, జైలు శిక్ష కూడా అనుభవించారు. 

ఇదీ చదవండిబీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,399 ప్లాన్‌ ఏడాది వ్యాలిడిటీతోపాటు మరిన్ని మైండ్‌ బ్లోయింగ్‌ బెనిఫిట్స్‌..  

ఇదిలా ఉండగా సుఖ్‌ బీర్‌ సింగ్‌ బాదల్‌పై 2007 -17 సమయంలో శిరోమణి ఆకలి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతపరమైన తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని దోషిగా తేల్చడంతో అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో సేవకుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ పాత్రలు, బూట్లు శుభ్రం చేసే శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెలలోనే ఈయన పార్టీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి :పుష్ప2 మూవీ చూడాలనుకునే ప్రేక్షకులకు బంపర్‌ ఆఫర్‌.. సగం ధరకే ఇలా టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు..

సిక్కు మత ఆచారాలను ఉల్లంఘించిన వారిని ఇలా శిక్ష విధించే అవకాశం ఉంది. ఆ శిక్షలో నేపథ్యంలో గోల్డెన్ టెంపుల్ వద్ద సుఖ్‌ బీర్‌ సింగ్ బాదల్ సేవకుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేకాదు ఇటీవల సుఖ్‌ బీర్‌ సింగ్ బాదల్‌ కుడి పాదానికి కూడా శస్త్ర చికిత్స జరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News