బండ్ల గణేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కడప కోర్టు
బండ్ల గణేష్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కడప కోర్టు
కడప: బండ్ల గణేష్‌కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. 2011లో తన వద్ద రూ.13 కోట్ల అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదని.. అతడు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని 2013లో కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేష్ ఫిర్యాదుపై కడప పోలీసులు బండ్ల గణేష్‌పై కేసులు నమోదు చేసినప్పటికీ.. బండ్ల గణేష్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులోనే బండ్ల గణేష్ నేడు కడప కోర్టుకు హాజరవగా.. కోర్టు అతడికి నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది.
బండ్ల గణేష్‌పై గతంలో కూడా ఈ తరహాలో చెక్ బౌన్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రముఖ సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌తోనూ బండ్ల గణేష్‌కి విబేధాలు తలెత్తి పోలీసు కేసు వరకూ వెళ్లింది. ఇదే కాకుండా మరో సినీనటుడు సచిన్, ముంబైకి చెందిన ఓ ఫైనాన్సియర్‌కి సైతం బండ్ల గణేష్‌పై విబేధాలు తలెత్తాయి.