ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాపట్ల ఎమ్మెల్యే  కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. డిప్యూటీ స్పీకర్  పదవికి రఘుపతి  ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నిండు సభలో ప్రకటించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన  కోనా రఘుపతిని స్పీకర్ స్థానంలోకి ఆహ్వానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోన రఘుపతి స్థానం దగ్గరికి వెళ్లి సీఎం వైఎస్ జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకొని అభినందించారు. అనంతరం ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఏపీ స్పీకర్ ఎన్నిక సమయంలో స్వయంగా వెళ్లి అభినందించని చంద్రబాబు..డిప్యూటీ స్పీకర్ విషయంలో మాత్రం అలాంటి సీన్ రీపీట్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు


స్పీకర్ ఎన్నిక సమయంలో తమ్మినేని సీతారాంకు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు స్వయంగా వెళ్లి అభినందలు తెలపకపోవడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన విసయం తెలిసిందే.  స్పీకర్ స్థానాన్ని చంద్రబాబు అవమానించారని సభలో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. స్పీకర్ ఎన్నిక సమయంలో తనకు సరైన గౌవరం ఇవ్వలేదని .. అందుకే తాను స్వయంగా వెళ్లి అభినందించలేకపోయానని చంద్రబాబు వివరణ ఇచ్చారు.


ఏది ఏమైనప్పటికీ  ఈ అంశం సభలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ విసయంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు స్వయంగా కోన రఘుపతి స్థానంలోకి వెళ్లి ఆత్మీయ అలిగనం చేసుకొని అభినందించడం.. సీఎం జగన్ తో కలిసి కోనరఘపతికి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం గమనార్హం. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.