ఏపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేరుస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడంపై బీసీ సంఘాలు మండిపడ్డాయి. తూర్పు గోదావరి కాకినాడ ప్రాంతంలో కలెక్టరేటు దగ్గర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు చితిపెట్టి నిప్పంటించాయి. పలువురు బీసీ నేతలు రోడ్డుపై బైఠాయించి, ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆపివేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది.


కాపులను బీసీల్లో చేర్చడంవల్ల వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఎన్నో అవకాశాలు కోల్పోతారని.. ఈ వర్గాల వారికి ఎనలేని నష్టం జరుగుతుందని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. అనుకోకుండాపలువురు బీసీ నేతలు కాకినాడ కలెక్టరేటు వద్ద ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడంతో.. పోలీసు బలగాలు వెనువెంటనే ధర్నా జరుగుతున్న ప్రాంతానికి చేరాయి. శాంతిభద్రతలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి.