భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారం చేపట్టే లండన్ పర్యటనను ప్రచార వ్యూహంగా మలచుకోవాలని బీజేపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. లండన్‌లో 18న మోదీ 'గ్లోబల్ కన్వర్వేషన్'లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలతో పాటు ప్రపంచంలో ఎవరైనా దేశ అభివృద్ధి, పథకాల అమలు, ఇతర అంశాలపై '#భారత్‌‌కీబాత్‌సబ్‌కేసాత్' అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేసి ప్రశ్నలు అడిగితే.. లండన్ వేదికపై మోదీ సమాధానమిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం ఆగడాలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ


టీడీపీ వారు కేంద్రంలోని బీజేపీపై చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ బీజేపీ వాళ్లు వాస్తవాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ బీజేపీ బలపడుతుందో అన్న భయంతో బీజేపీని అణిచివేయలనే దురుద్దేశంతో గుంటూరు, కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ కార్యాలయలయాలపై దాడులు చేయించారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. 'సోమవారం చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులుపై ఏకంగా భౌతిక దాడి చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బలపడకూడదు.. తెలుగుదేశం పార్టీ మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే దురుద్దేశంతో అనేక కుటిల రాజకీయాలు చేస్తున్నారు' అని  రాష్ట్ర బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.


'దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించడం, బీజేపీ నాయకులపైన, కార్యాలయాలపైనా దాడులు చేయించడం వంటి అప్రజాస్వామ్యక కార్యక్రమాలు చేయిస్తూ, రాష్ట్ర శాంతి, భద్రతలకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఈ విషయాలపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలి' అని బి.జె.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్‌తో కూడిన భారతీయ జనతా పార్టీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది.