Trains Cancelled: దీపావళికి ఊరెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ముఖ్య గమనిక, ఈ రైళ్లు రద్దయ్యాయి మరి
Trains Cancelled: దీపావళి సమీపిస్తోంది. ముఖ్యమైన పండుగ కావడంతో ప్రయాణాలు తప్పవు. రైలు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కాస్త గమనించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే రోజూ ప్రయాణించే కొన్ని రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Trains Cancelled: నిత్యం రైల్వే ప్రయాణం చేసేవారికి లేదా దీపావళి పురస్కరించుకుని ఊళ్లకు లేదా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే రైల్వే శాఖ జారీ చేసిన సూచనలు కాస్త చూడాల్సి ఉంటుంది. రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఏ రైళ్లు రద్దయ్యాయో తెలుసుకోకపోతే సమస్య ప్రయాణం ఇబ్బందికరంగా మారవచ్చు.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతా పరమైన పనులు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేేసింది. ఏయే రైళ్లు రద్దయ్యాయనేది రాజమండ్రి, సామర్లకోట, తుని, పిఠాపురం, అనపర్తి రైల్వే స్టేషన్లలో సూచనలు ఏర్పాటు చేశారు. అందుకే రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడకు ప్రయాణాలు చేసేవారు రైల్వే శాఖ ఏయే రైళ్లను రద్దు చేసిందో తెలుసుకుంటే మంచిది.
రైలు నెంబర్ 17239 గుంటూరు-విశాఖపట్నం 19 వతేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు 20 తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 22701 విశాఖపట్నం-విజయవాడ 18వ తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 22702 విజయవాడ-విశాఖపట్నం 18 వరకూ రద్దు
రైలు నెంబర్ 07466 రాజమండ్రి-విశాఖపట్నం 19 వరకూ రద్దు
రైలు నెంబర్ 07467 విశాఖపట్నం-రాజమండ్రి 19వ తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 17267 కాకినాడ-విశాఖపట్నం 19 వరకూ రద్దు
రైలు నెంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ 19వ తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 12717 విజయవాడ-విశాఖపట్నం 13 వరకూ రద్దు
రైలు నెంబర్ 12718 విశాఖపట్నం-విజయవాడ 13 వరకూ రద్దు
రైలు నెంబర్ 17219 విశాఖపట్నం-మచిలీపట్నం 20 వరకూ రద్దు
రైలు నెంబర్ 17220 మచిలీపట్నం-విశాఖపట్నం 20 తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 17243 గుంటూరు-రాయగడ్ 20వ తేదీ వరకూ రద్దు
రైలు నెంబర్ 17244 రాయగడ్-గుంటూరు 20వ తేదీ వరకూ రద్దు
Also read: Chandrababu Case Updates: చంద్రబాబు క్వాష్‌పై కొనసాగుతున్న సస్పెన్స్, దీపావళి తరువాతే తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook