AP Investments Boost: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయని.. వాటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు. క్లీన్ ఎనర్జీ పాలసీతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు వరుస కట్టాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bandi Sanjay: 'రేవంత్‌ రెడ్డిలో పవన్‌ కల్యాణ్‌కు ఏం కనిపించిందో?' కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు


అమరావతిలోని సచివాలయంలో సోమవారం జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మొత్తం 9 ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్తగా వస్తున్నాయని.. వీటి ద్వారా రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు రూ. 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.

Also Read: Chandrababu: ఏపీ కరువు రహిత రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటుతో 2,400 మందికి ఉపాధి కలుగనుందని అధికారులు సీఎంతో చెప్పారు. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్, బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. వాటికి సత్వరమే ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నూతనంగా తెచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీతో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 

రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు ఇవే


  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)- విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌

  • ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్- శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లి

  • బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్-అనకాపల్లి జిల్లా రాంబిల్లి

  • ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్- కాకినాడ

  • జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్- కాకినాడ

  • టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్- కర్నూలు జిల్లా హోసూరు, పెద్ద హుల్తి

  • క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్- వైఎస్సాఆర్ జిల్లా మైలవరం, కొండాపురం, కొలిమిగుండ్ల

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.