Banakacharla Head Regulator: గోదావరిలో వరదల సమయంలో 280 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాతోపాటు రాయలసీమకు తరలించేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రచించారు. 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే భారీ లక్ష్యంతో ముందడుగు వేశారు. దీనికి దాదాపు రూ.70 వేల కోట్ల నుంచి రూ.80,000 కోట్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి జలహారతి పట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా బానకచర్లకు గోదావరి నీటిని తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ అహంకారాన్ని తగ్గిస్తాం
ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బానకచర్ల ప్రాజెక్టుపై సోమవారం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతపై అధికారులతో చర్చించారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకోవడంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read: Tirumala: వైకుంఠ ఏకాదశికి భక్తులకు టీటీడీ శుభవార్త.. రెండు రోజులు స్వామివారి ప్రత్యేక దర్శనం
పోలవరం ప్రాజెక్టుతో 8 ఉమ్మడి జిల్లాలకు (ఉత్తారంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు) లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో వరదల సమయంలో వృథాగా వెళ్లే ఆ నీటి నుంచి 280 టీఎంసీలను తీసుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బానకచర్లకు తరలించడమే మార్గమని తెలిపారు. గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నట్లు అధికారులకు చెప్పారు. పోలవరం, బానకచర్లతో రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
జలహారం ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని చెప్పారు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.70 వేల నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని, 54 వేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని గుర్తించారు. ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించి కేంద్ర సాయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
జలహారతి ప్రణాళిక
- గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం.
- కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. 200 టీఎంసీల సమర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం
- బొల్లాపల్లి నుంచి 31 కి.మీ టన్నెల్ ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటికి తరలింపు
- బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, నిప్పుల వాగుకు నీటి తరలింపు
- నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలించడం
- అనంతరం వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు నీటిని తరలించడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook