Vizag And Vijayawada Metro Rail: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖపట్టణం, విజయవాడకు త్వరలోనే మెట్రో రైలు కల సాకారం కానుంది. అది కూడా సాధారణ మెట్రో రైలు కాకుండా డబుల్‌ డెక్కర్‌ మెట్రో రైలు రానుండడం విశేషం. ఈ మేరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో కోసం సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్‌పై చర్చించారు. రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కిలో మీటర్ల మేర నిర్మించాలని సీఎం నిర్ణయించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల భారీ షాక్‌.. కోడి పందాలకు బ్రేక్‌


విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆ మెట్రో ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం అమరావతిలోని సచివాలయంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. విజయవాడ మెట్రో 66 కి.మీ మేర, విశాఖ మెట్రో 76.90 కి.మీ మేర చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్‌లు ఆమోదించిన విషయం తెలిసిందే. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్‌పై సీఎం చర్చించారు. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్రం భరించే విధానం లేకపోవడంతో ఆ అంశంపై సమాలోచనలు చేశారు.

Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల భారీ షాక్‌.. కోడి పందాలకు బ్రేక్‌


కేంద్ర సహాయంతో
2017 విధానం ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కత్తాలో 16 కి.మీ మేర ప్రాజెక్టు రూ.8,565 కోట్లతో చేపట్టిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.


డబుల్ డెక్కర్‌ రైలు
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమనూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నాలుగేళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.