Vizag: `వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?`.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్ రేప్
Law Student Gang Raped By Four Students In Vizag: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కరువైనట్టు కనిపిస్తోంది. తరచూ ఎక్కడో చోట నేరాలు జరుగుతుండగా.. తాజాగా విశాఖపట్టణంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఏపీలో సంచలనంగా మారింది.
Visakhapatnam Gang Rape: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరాల సంఖ్య మరింత పెరుగుతుండడం ఆందోళన వ్యక్తమవుతుండగా.. తాజాగా మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్టణంలో న్యాయ విద్య చదువుతున్న విద్యార్థిపై సామూహిక అత్యాచారం జరిగిందనే వార్త కలకలం రేపింది. ఆమె ప్రియుడే నమ్మించి మోసం చేసి ఇతరులతో కలిసి బలత్కారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఈ సంఘటనపై వెంటనే హోంమంత్రి విచారణకు ఆదేశించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Heart Attack: అమ్మ గ్రూపు 3 పరీక్ష రాసి వచ్చేసరికి నాలుగేళ్ల కుమార్తె గుండెపోటుతో మృతి
విశాఖపట్టణంలో ఎన్‌వీపీ కళాశాలలో ఓ లా చదువుతోంది. ఆమెకు తోటి విద్యార్థి వంశీతో స్నేహం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో వారిద్దరూ ఏకమయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మూడు రోజులకు అంటే ఆగస్టు 13వ తేదీన దాబా గార్డెన్‌లో ఉంటున్న అతడి స్నేహితుడు ఆనంద్ ఇంటికి వంశీ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా తన స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్‌తో కూడా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.
Also Read: Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?
అయితే బలత్కారం చేసే సమయంలో వీడియోలు తీశారు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగ దీసుకుంటున్నారు. పదే పదే వారు బెదిరిస్తూ ఆమెపై బలత్కారం చేస్తున్నారు. రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్‌తో ఆ యువతికి ఫోన్ చేసి తమ వద్దకు వచ్చి మళ్లీ కోరిక తీర్చాలని బెదిరించారు. లేదంటే వీడియోలు బయటపెడతామని చెప్పగా వారి వేధింపులపై ప్రియుడు వంశీకి చెప్పగా అతడు కూడా వారి వద్దకు వెళ్లమని చెప్పాడు.
వారి వేధింపులు.. ప్రియుడు చేసిన మోసం తాళలేక ఈనెల 18వ తేదీన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా.. తండ్రి అడ్డుకున్నాడు. ఏం జరిగిందని నిలదీయడంతో తనపై జరిగిన ఘోరాన్ని వివరించి కన్నీటి పర్యంతమైంది. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు లా విద్యార్థులు కాగా.. ఒకరు వరుణ్ మోటార్స్‌లో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు.
నేరాల సంఖ్య పెరుగుదలపై ఆందోళన
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు తీవ్రమవుతున్నాయి. మహిళలు, యువతులపై రోజురోజుకు నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంతో సహా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే హోంమంత్రి అనితపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై నేరాల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter