Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?

Girl Friend Body Cuts 22 Parts In Telangana: తాము చేసిన మోసం బయటపడడంతో డబ్బుల పంపకంలో విభేదాలు ఏర్పడడంతో సొంత ప్రియురాలినే ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా గోనే బస్తాలో పెట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 13, 2024, 04:35 PM IST
Money Issue: ప్రియురాలిని 22 ముక్కలు నరికి కసి తీర్చుకున్న ప్రియుడు.. ఎందుకంటే?

Bhadradri Kothagudem District: అబ్బాయి, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ప్రియుడు.. ప్రియురాలు డబ్బులు దండుకుని మోసం చేశారు. వీరి చేతిలో మోసపోయిన బాధితులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయిన తర్వాత వారి డబ్బులను ప్రియుడు ప్రియురాలు పంచుకున్నారు. డబ్బు పంపకాల్లో తేడా రావడంతో ఆ జంట మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో డబ్బు కోసం తన ప్రియురాలిని అత్యంత దారుణంగా ప్రియుడు హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గోనె బస్తాలో కట్టేసి పొలంలో పూడ్చి పెట్టాడు. ఇంతటి దారుణ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Add Zee News as a Preferred Source

Also Read: Tragic Incident: ప్రేమతో భార్య చికెన్‌ బిర్యానీ పెట్టగా.. తెల్లారేసరికి శవమైన భర్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన స్వాతి, వీరభద్రం ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తమకు తెలిసిన ఓ జంటకు వీరిద్దరూ సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఆ జంట నుంచి రూ.16 లక్షలు వసూల్‌ చేశారు. కొన్ని వారాలు గడిచినా స్వాతి- వీరభద్రం సింగరేణిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇచ్చిన అబ్బాయి అమ్మాయి మోసపోయామని గ్రహించి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.

Also Read: Fire Accident: దీపావళికి ముందే దుర్ఘటన.. బాణాసంచా దుకాణంలో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌

వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్లు ఇచ్చిన రూ.16 లక్షలు మిగిలిపోయాయని స్వాతి, వీరభద్రం ఆనందపడ్డారు. ఇద్దరూ పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. డబ్బుల వివాదం తీవ్రం దాల్చడంతో తన ప్రియురాలిని చంపేసి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మూడు రోజుల కిందట వీరభద్రం స్వాతిని అత్యంత కిరాతకంగా చంపాడు. ఆమెను 20 ముక్కలు ముక్కలుగా చేశాడు. అనంతరం ముక్కలన్నింటిని గోనె సంచిలో వేశాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి పొలంలో పూడ్చిపెట్టాడు.

కొన్ని రోజులుగా స్వాతి కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరభద్రంపై అనుమానం వ్యక్తం చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు కక్కాడు. వెంటనే స్వాతి శరీర భాగాలను తీసుకుని పోస్టుమార్టానికి పోలీసులు పంపించారు. అనంతరం నిందితుడు వీరభద్రాన్ని రిమాండ్‌కు తరలించారు. డబ్బు కోసం ప్రియురాలిని చంపడమే కాకుండా కసితీరా ముక్కలు ముక్కలుగా చేయడం కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News