YS Sharmila letter on Jagan : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగక ముందే.. వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు ఏర్పడిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు.. తర్వాత అందులో అవినాష్ రెడ్డి హస్తం ఉంది అనేట్టుగా పరోక్షంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈయనకు వైయస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. దీనికి తోడు వివేకానంద రెడ్డి కూతురు సునీత కూడా షర్మిలకు సపోర్టుగా తమ అన్నయ్య వైయస్ జగన్మోహన్ రెడ్డి పై.. మాటల దాడికి దిగారు. బాబాయ్ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందని.. అలాంటి వ్యక్తితో మీకు మాటలు ఏంటి అంటూ ఏడాది ఎలక్షన్స్ జరిగిన సమయంలో పోటాపోటీగా మాటల తూటాలు విసిరిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇదిలా ఉండగా.. గత రెండు రోజుల నుంచి వైయస్సార్  కుటుంబంలో ఆస్తి పంపకాల గొడవలు రోడ్డున పడ్డాయని.. చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైయస్సార్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.. వైయస్ షర్మిలా రెడ్డి. ఆమె మాట్లాడుతూ.. “నాన్నగారు స్థాపించిన సాక్షి పేపర్ ని ఈరోజు ఉదయం నేను చదవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో.. సాక్షి మీడియా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన దేనినైనా.. ఆ పేపర్ ద్వారా  నమ్మించగలరు. కానీ వైఎస్ఆర్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను” అంటూ ఒక లేఖ వదిలింది. 


ఇక అందులో.. “అమ్మ వైయస్ విజయమ్మ , నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు కదా.. అందులో నాన్న గురించి.. ప్రత్యేకంగా ఒక మాట కూడా రాశారు. రాజశేఖర్ రెడ్డికి  లోకం అంతా ఒక ఎత్తు.. ఆయన బిడ్డ షర్మిల మరో ఎత్తు అని రాశారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారికి నేనంటే ఎంత ఇష్టమో. నేను ఒక ఆడపిల్లని అయినా కానీ.. ఆయన ఎప్పుడూ కూడా నన్ను ఆ ధోరణిలో చూడలేదు.  నాన్న బ్రతికున్నన్ని రోజులు.. మాకు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు. నా యావదాస్తి నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ కి సమానం అని చెబుతుంటే వారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాలలో.. నలుగురి పిల్లలకి సమానమైన హక్కు ఉంటుంది.  రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే కదా.. అవి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సొంతం కాదు. దయచేసి ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించుకుంటే మంచిది. ఆ పిల్లలకు ఆయన కేవలం గార్డియన్ మాత్రమే.  అంతేకానీ వాటిపైన సర్వహక్కులు ఆయనకే ఉండవు. ఈ విషయం మా బంధువులైన కెవిపి రామచంద్రరావు, వైవి సుబ్బారెడ్డి , విజయసాయిరెడ్డి లకు కూడా తెలిసిన విషయమే,” అంతు చెప్పకువచ్చింది. 


“నాన్న స్థాపించిన అన్ని వ్యాపారాలు సరస్వతి , భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, యలహంక ప్రాపర్టీ , క్లాసిక్ రియాల్టీ ఇలా ఏవైతే.. నాన్న సంపాదించి పెట్టారో.. అన్నిట్లో కూడా మా నలుగురు పిల్లలకి సమాన వాటా ఉంది. అంతేకాదు ఒక వైఎస్ఆర్ మాండేట్ మినహా.. ఇక ఏ ఆస్తి పంపకాలు కూడా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు జరగలేదు.  ఆ తరువాత నాన్నగారు హఠాత్తుగా మరణించారు. ఆయన మరణించి చాలా కాలం అవుతున్నా కానీ.. నాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నాకు రావాల్సిన ఆస్తి కూడా రాలేదు. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడే ఆస్తి పంపిణీ జరిగిందన్నది అవాస్తవం. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు.  జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం.  నేను ఆయన ఆస్తులు ఎప్పుడూ కూడా అడగలేదు.  నా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే నేను అడుగుతున్నాను,” అంటూ ఆమె బహిరంగ లేఖ రాసింది. మొత్తానికైతే జగన్ గుట్టును కాస్త రట్టు చేసింది షర్మిలారెడ్డి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 


కాగా చివరిలో ఎవ్వరు కూడా తన గురించి తన తల్లి విజయమ్మ గురించి తప్పుగా అనుకోకూడదని ఈ విషయాలు బయటపెడుతున్నట్టు చెప్పుకొచ్చారు.


 


Read more: Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter