Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..

Samantha ruth prabhu: సమంతా రూత్ ప్రభు తరచుగా వార్తలలో ఉంటున్నారు.  ఇటీవల  ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరిస్ లో భాగంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 24, 2024, 05:44 PM IST
  • మళ్లీ వార్తలలో నిలిచిన సమంతా..
  • సీటాడెల్ వెబ్ సిరిస్ లో ఆ పని..
Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..

Samantha citadel web series video: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఇద్దరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి సమంతా మరోసారి వార్తలలో నిలిచారు. అప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఆమె తరచుగా ట్రెండింగ్ గా మారుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ  సమంతాపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లోనే  కాకుండా.. సినిమా రంగంలో కూడా రచ్చగా మారాయి. దీనిపై సమంతా కూడా అదే రేంజ్ లో మంత్రి కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు. సినిమా  ఇండస్ట్రీ అంతా ఈ విషయంలో సమంతాకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.

 

ఇటీవల సమంతా జిగ్రా మూవీ రీలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో రాణా దగ్గుబాటి,  త్రివిక్రమ్ లు పాల్గొన్నారు. అంతే కాకుండా.. నటి సమంతా జిగ్రాఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. అయితే.. ప్రస్తుతం సమంతా రూత్ ప్రభు మరో మారు వార్తలలో నిలిచారు. తాజాగా, సిటాడెల్ వెబ్ సిరిస్ కార్యక్రమంలో సమంతా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సమంతా వేసుకున్న కాస్ట్యూమ్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకొవచ్చు.

పూర్తి వివరాలు..

సమంతా రూత్ ప్రభు ఇటీవల కాలంలో తరచుగా వార్తలలో ఉంటున్నారు. జిగ్రా మూవీ ఈ వెంట్ లో పాల్గొన్నారు. సమంతాపై.. ఆలియాభట్, దగ్గుబాటి రాణా, త్రివిక్రమ్ లు ప్రశంసలు సైతం కురిపించారు. ఇదిలా ఉండగా.. సమంతా తాజాగా.. సిటాడెల్ హనీ బన్నీ  వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమంతా అదిరిపోయే కాస్ట్యూమ్ ను వేసుకున్నారు. డిజైనర్ సమంతా బాడీ ఫిట్ కు తగ్గట్లుగా అదిరిపోయే అవుట్ ఫిట్ ను రూపొందించారు.  

ఇందులో సమంతా మాత్రం క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్నారు. అయితే.. సమంతా మాత్రం ఆ డ్రెస్ ను ఆమె డిజైనర్ అడ్జెస్ట్ చేస్తున్నారు. సమంతా కూడా.. ఆ డ్రెస్ లో కాస్తంతా అసౌకర్యానికి గురై.. మళ్లీ అందరి ముందే సెట్ చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతంవైరల్ గా మారింది. ఈ వీడియోలో సమంతా ఎంతో అదిరిపోయేలా ఉన్నారని, ఇలాంటి జాబ్ వస్తే.. రోజు పండగే అంటూ కూడా నెటిజన్ లు ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.

Read more: Samantha: అప్పుడు స్పై ఏజెంట్ గా మారాల్సింది.. చైతూపై సామ్ పరోక్ష కామెంట్స్..!
 

మరోవైపు.. సిటాడెల్ వెబ్​ సిరిస్   ఫ్యాక్షన్‌ థ్రిల్లర్​ గా తెరకెక్కింది. దీనిలో వరుణ్ ధావన్, సమంత , సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తొంది. దీనిలో సమంతా.. హనీ అనే పాత్రలో స్పై ఏజెంట్ గా నటిస్తున్నారని సమాచారం. దీపావళి కానుకగా ఈ సిరిస్ అభిమానుల మనస్సులు గెల్చుకుంటుందని టీమ్ భావిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News