Dismissed 40 AP Govt Advisers: ఎన్నికల ఫలితాల్లో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలనపై కూడా మౌఖిక ఆదేశాలు వస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో తీవ్ర విమర్శల పాలైన సలహాదారుల వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తొలగించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Govt Officers Tension: రెచ్చిపోయిన అధికారులకు షాక్‌.. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే ఆట మొదలెట్టిన చంద్రబాబు


 


ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నప్పుడు 40 మంది సలహాదారులను నియమించుకున్నారు. దాదాపుగా అన్ని శాఖలకు సలహాదారులు కొనసాగారు. అయితే పరిపాలనలో సలహాదారుల పెత్తనం అధికమైందనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అధికారం చేపట్టబోతున్న పార్టీలు కూడా సలహాదారుల వ్యవస్థలపై తీవ్ర విమర్శలు చేశాయి. తాజా ఎన్నికల్లో జగన్‌ ఓటమికి సలహాదారులు కూడా ఒక కారణమనే చర్చ జరుగుతోంది. అలాంటి సలహాదారులను తాజాగా ప్రభుత్వం తొలగించింది.

Also Read: YS Sharmila: నాడు అన్నను గెలిపించిన చెల్లెలు.. నేడు అన్నను ఓడించిన షర్మిల


 


గతంలో నియామకమైన 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అధికారం కోల్పోయిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.


త్వరలో కఠిన చర్యలు?
అయితే అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. టీడీపీ కూడా సలహాదారులపై తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలో ఉన్న సమయంలో సలహాదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని తొలగించినా భవిష్యత్‌లో వారి అవినీతి బాగోతాలు బయటకు తీసి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter