Kilari Rosaiah: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి రాజీనామా
YSRCP Guntur MP Candidate Kilari Venkata Rosaiah Resigned: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పోటీ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి రాజీనామా చేశారు.
Kilari Venkata Rosaiah: అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ధర్నాకు దిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకరు భారీ షాక్ ఇచ్చారు. కొన్ని నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సంచలనం రేపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్, వైఎస్సార్‌సీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలు
ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కిలారి రోశయ్య తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పొన్నూరు నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రోశయ్య పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఘోర ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటి నుంచి రోశయ్య రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరమైన ఆయన ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. కిలారి రోశయ్య ఎవరో కాదు వైఎస్సార్‌సీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు.
Also Read: Pawan Vs Jagan: ఛీ కొట్టినా జగన్ నీకు బుద్ధి రాదా? మాజీ ముఖ్యమంత్రిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
గుంటూరులో బుధవారం తన అనుచరులతో రోశయ్య సమావేశమయ్యారు. అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'వైఎస్సార్‌సీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నాయకుడి విషయంలో కనీసం చర్చ జరగలేదు. మండలిలో చైర్మన్ అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు' అని కిలారి రోశయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
'గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయించారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడిపిస్తున్నారు. ఇలాంటి వైఎస్సార్‌సీపీలో నేను కొనసాగలేను' కిలారి రోశయ్య ప్రకటించారు. రాజీనామా చేసిన ఆయన త్వరలోనే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాగా అధికారం కోల్పోయిన వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి