Rama Shiva Reddy on MLA Kotamreddy Sridhar Reddy Phone Tapping: ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఇష్యూలోకి కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కాదని.. కాల్ రికార్డింగ్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చిన ఆయన అసలు ఏం జరిగిందో మొత్తం వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కోటంరెడ్డి నాతో కాంట్రాక్టులు, రాజకీయాల గురించి మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడిన మాటలే మళ్లీ నాతో చెప్పారు. నా ఫోన్‌లో ఆటోమేటిక్ కాల్ రికార్డు ఆన్ అయి ఉంది. దీంతో నాకు వచ్చిన ప్రతీ కాల్ ఆలోమేటిక్‌గా రికార్డు అవుతుంది. కోటంరెడ్డితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ నేను  మరో కాంట్రాక్టర్‌కు షేర్ చేయటంతోనే అది వైరల్ అయింది. నేను ఉద్దేశపూర్వకంగా కాల్ రికార్డింగ్ షేర్ చేయలేదు. ఇంత వైరల్ అవుతుందని నేను ఊహించలేదు.


ఏ విచారణ సంస్థ అడిగినా నేను నా కాల్ రికార్డింగ్ వివరాలు ఇచ్చేందుకు రెడీ. కేంద్ర విచారణ సంస్థలు, ఫోరెన్సిక్‌కు నా ఫోన్ ఇవ్వమని అడిగినా ఇచ్చేందుకు నేను సిద్ధం. కోటంరెడ్డి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలియడం లేదు. నేను వైఎస్సార్ భక్తుడిని. నన్ను ఎవరూ కలవలేదు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలను చూసే.. క్లారిటీ ఇచ్చేందుకు ఈ రోజు మీడియా ముందుకు వచ్చా. నాపై ఎవరి ఒత్తిడి లేదు..' అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన ఫోన్‌లో 4 నెలల నుంచి రికార్డు అయిన కాల్ డేటాను మీడియాకు చూపించారు. 


మరోవైపు జగన్ సర్కారుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. తాను ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం తరుఫున తిట్టు శాపనార్థాలు కాకుండా.. తమ పార్టీ శాసనసభ్యుడి ఫోన్ ట్యాప్ అవుతుందని విచారణ జరిపించాల్సిందిగా బాధ్యతగా కేంద్రానికి లేఖ రాయాల్సిందన్నారు. 


Also Read: ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల హవా.. నంబర్ టు ప్లేస్‌కు హార్ధిక్ పాండ్యా  


Also Read: MLA Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి