న్యూఢిల్లీ: ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదల్చుకోలేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu Veerraju) స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర  ప్రభుత్వ నిర్ణయంలో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని చెబుతూ.. గతంలో చంద్రబాబు ( Chandrababu Naidu) హయాంలోనూ కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. కానీ చంద్రబాబే రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, చైనా అంటూ ప్రజలను మభ్యపెడుతూ.. కాలక్షేపం చేశారని సోము వీర్రాజు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. Also read: Water sharing row: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ( 3 Capitals of AP) విషయంలోనూ కేంద్రం కలుగజేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికే స్వేచ్ఛ ఇస్తోందని చెప్పిన సోము వీర్రాజు.. అదే సమయంలో రాజధాని ప్రాంత రైతులకు (Amarawati farmers) న్యాయం జరగాలన్న తమ డిమాండ్‌కి మాత్రం బీజేపి చివరి వరకు కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తొలిసారిగా గురువారం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సోము వీర్రాజు.. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడి ఇంటి పార్టీ అయిందని ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపి వైఖరి టీడీపీలా కాదని.. బీజేపి సకలజనుల పార్టీ అని సోము వీర్రాజు పునరుద్ఘాటించారు.


Also read: COVID-19: బక్రీద్ ప్రార్థనలపై మార్గదర్శకాలు


రాజధాని విషయంలో బీజేపీని ( BJP) ఇరుకున పెట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన సోము వీర్రాజు... కొంతమంది బీజేపీ నేతలు తనకు దగ్గర అవుతున్నారంటూ చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో బీజేపి కఠినంగా వ్యవహరించబోతుందని చెబుతూ.. చంద్రబాబు ఆడే చదరంగంలో తాము కూడా కొత్త ఎత్తుగడలు వేస్తామని హెచ్చరించారు. బీజేపీ-జనసేనకు 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు తాము భావిస్తున్నామని ఈ సందర్భంగా సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. Also read: Sonia Gandhi: ఆస్పత్రిలో సోనియా గాంధీ