Water sharing row: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

Water sharing row: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది.

Last Updated : Jul 31, 2020, 12:37 AM IST
Water sharing row: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

హైదరాబాద్‌ : కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను పొందే విషయంలో అసలు ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM Kcr) ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయం వ్యక్తచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది ( Krishna river), గోదావరి నది ( Godavari river) జలవివాదాల పరిష్కారం కోసం ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయదల్చినందున ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుతూ ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యూపీ.సింగ్ తెలంగాణ సర్కారుకి ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు గురువారం ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖ సలహాదారులు, నిపుణులు, సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నదీ జలాల్లో తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని.. అవసరమైతే అందుకు ఎంతటి పోరాటానికైనా తెలంగాణ సర్కారు ( Telangana govt) సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. Also read: COVID-19: బక్రీద్ ప్రార్థనలపై మార్గదర్శకాలు

అపెక్స్ కౌన్సిల్ సమావేశమై చర్చిస్తూ.. ఆగస్టు 5న ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున, వాటికి అసౌకర్యం కలగకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం ఆగస్టు 20 తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది ఇదే విషయమై కేంద్ర జల వనరుల శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి సూచించారు. తెలంగాణ, ఏపీ మధ్య నది జలాల పంపకాల విషయంలోనూ కేంద్ర జల వనరుల శాఖ బాధ్యతతో వ్యవహరించడం లేదని సమావేశానికి హాజరైన నిపుణులు, సలహాదారులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సమావేశానికి హాజరైన వాళ్లందరి నుంచి సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. Also read: COVID-19 in AP: 24 గంటల్లో 68 మంది మృతి

Trending News