కాంగ్రెస్ అజెండా టీడీపీ అమలు చేస్తోంది - బీజేపీ నేత రఘురాం
మోడీ సర్కార్ పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో టీడీపీపై టీడీపీ ఢిల్లీ సమన్వయకర్త రఘురామ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ పొత్తు అవసరమని భావించి ఈ మేరకు కేంద్రంపై అవిశ్వాసం పెట్టిందని విమర్శించారు. అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ పెట్టినా..అంది కాంగ్రెస్ పార్టీ అజెండా అని ఆరోపించారు. కాంగ్రెస్ అడుగుజాడల్లో టీడీపీ నడుస్తోందనడానికి ఇంత కంటే వేరే సాక్ష్యం అక్కర్లేదన్నారు. అవిశ్వాసంతో పేరుతో ప్రజలను టీడీపీ వంచిస్తోందని బీజేపీ నేత రఘురామ్ విమర్శించారు.
ప్రతిపక్షాలది మేకపోతు గాంభీర్యం
బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిసినా అవిశ్వాసం నోటీసు ఇవ్వడం అర్థరహితమని.. ఇది కేవలం బీజేపీకి బద్నాం చేయడానికి తప్పితే మరోకటి కాదని రఘురామ్ విమర్శించారు. వాస్తవానికి ప్రతిపక్షాలకు 150 మంది సభ్యుల బలం కూడా లేదన్నారు. దీనిపై విపక్షాలు ప్రగల్భాలు పలకడం హాస్యాస్పందమన్నారు. శివసేన పార్టీ తమతో నిలవడం శుభసూచకమన్నారు. అన్నాడీకేం అవిశ్వాతీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకురాలేదని..ఇలాంటి తరుణంలో వారు అవిశ్వాసం ఎలా నెగ్గుతారో ప్రతిపక్షాలు చెప్పాలని రఘురామ్ డిమాండ్ చేశారు.