బీజేపీ జాతీయ కార్యదర్శి ( Bjp national secretary ) రామ్ మాధవ్ ( Ram madhav ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలో రావడం అంత ఈజీ కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ( Ap Bjp president ) నియమితులైన సోము వీర్రాజు ( Somu veerraju ) ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ జాతీయ కార్యదర్సి రామ్ మాధవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో బీజేపీ అధికారంలో రావడమనేది ( getting into power in bjp is not easy ) అంత సులభం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని సోము వీర్రాజును కోరారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని...బీజేపీ దాన్ని భర్తీ చేయాలని రామ్ మాధవ్ సూచించారు. హైదరాబాద్ లోనే ఉండి 5-10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పినా...హైదరాబాద్ వదిలేసి ఎందుకొచ్చారో అందరికీ తెలుసని చంద్రబాబుపై ( Chandra babu ) విమర్శలు చేశారు. 


రాజధాని విషయంలో ( Capital issue ) రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకోలేదని రామ్ మాధవ్ చెప్పారు. రాజధానిపై కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదన్నారు. రాజధాని ఎక్కడనేది నిర్ణయించేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమేనని రామ్ మాధవ్ మరోసారి స్పష్టం చేశారు. Also read: Covdi 19 Review : రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్