అమరావతి: రాజకీయాశాల్లో ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చని.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు వుండరు, శాశ్వత శత్రువులు వుండరు అనేది తరచుగా వినిపించే డైలాగ్. తాజాగా ఏపీకి చెందిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఇంచు మించు అటువంటి డైలాగ్‌నే వినిపించారు. ఏపీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని చెబుతూ ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపి ఎదగకుండా ఉండేందుకు చంద్రబాబు అన్నిరకాల ప్రయత్నించారని, ఆఖరికి అధికారులతో కూడా బీజేపిని తిట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ఏపీలో బీజేపి కచ్చితంగా బలపడుతుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తంచేశారు. 


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరడంపై సోము వీర్రాజు స్పందిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అలా అడగడంలో తప్పేమీ లేదని అన్నారు.