విజయవాడ: కృష్ణానది పవిత్ర సంగమం వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో తొలి రోజు 16 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. కాగా సోమవారం చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందింది..దీంతో పాటు సోమవారం జరిపిన గాలింపు చర్యల్లో మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య 21కి చేరినట్లయింది. 


ప్రమాదానికి గురైన  బోటులో సిబ్బందితో సహా మొత్తం 45 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య 21 కాగా.. మరో 20 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురిలో చిన్నారి అశ్విక , ముగ్గురు పడవ సిబ్బంది ఆచూకీ లభించాల్సి ఉంది.