Boats Removal: కృష్ణా నది భారీ వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన మూడు పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకుపోయయి. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంలో బోట్లను తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చిక్కుకున్న బోట్లను కనీసం కదల్చలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు చివరి ప్రత్యామ్నాయం అమలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కృష్ణా నదిలో సంభవించిన భారీ వరదలకు ఇసుకతో కూడిన భారీ బోట్లు మూడు ప్రకాశం బ్యారేజ్ గేట్లలో చిక్కుకుపోయాయి. బ్యారేజ్ గేట్లను కూడా ధ్వంసం చేశాయి. బ్యారేజ్‌కు చెందిన 67,68,69 గేట్లలో ఇవి చిక్కుకున్నాయి. వరద సమయంలో ఈ బోట్లను తొలగించలేకపోయారు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దాంతో భారీ క్రేన్లతో బోట్ల తొలగింపు చేపట్టారు. 50 టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు భారీ క్రేన్లు ఉపయోగించి ఆ బోట్లను తొలగించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బోట్లను ఒకదానికొకటి చిక్కుకుపోయుండటం వల్ల అసలు కదల్లేకపోతున్నాయి. దాంతో తీవ్రంగా శ్రమించిన అధికారులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 


ఇక ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ ప్లాన్ ప్రకారం డైవింగ్ బృందాలు రంగంలో దిగనున్నాయి. విశాఖపట్నం నుంచి అనుభవజ్ఞులైన నిపుణుల్ని రప్పిస్తారు. ఈ బృందాలు నీటిలోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలు చేస్తారు. పరిస్థితిని బట్టి నాలుగైదు ముక్కలు చేసి క్రేన్లతో పైకి లేపడం లేదా ప్రవాహం దిగువకు పంపించడం చేస్తారు. రేపు ఈ పనులు ప్రారంభం కానున్నాయి. 


కృష్ణా నది ప్రవాహం ఉండగానే పడవల తొలగింపు పని చేపట్టినా సాధ్యం కాలేదు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గిన తరువాత కూడా అదే పరిస్థితి. దాంతో ఇక బోట్లను కట్ చేసి తొలగించే ప్రక్రియ రేపు ప్రారంభించనున్నారు. 


Also read: Godavari Floods: ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, రెండో ప్రమాద హెచ్చరిక జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.