Tirumala Kidnap: తిరుమల కొండపై మరోసారి కిడ్నాప్ కలకలం రేగింది. శ్రీవారి ఆలయం ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ ఫోటోను విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. ఓ మహిళ బాలుడిని తీసుకెళ్లింది. ఆలయం ముందు తల్లితోపాటు ఉన్న సమయంలో బాలుడిని మహిళ ఎత్తుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు గురైన బాలుడు తిరుపతి దామీనీడుకు చెందిన గోవర్ధన్‌గా పోలీసులు గుర్తించారు.


దీనిపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడిని ఎత్తుకెళ్లిన మహిళ తొలుత తిరుపతికి వచ్చినట్లు గుర్తించారు. తిరుపతిలో ఏపీ 03జడ్ 0300 నంబర్‌ గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు తేల్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. నిందితురాలి ఫోటోలను సైతం పోలీసులు విడుదల చేశారు. త్వరలోనే బాలుడిని తల్లి చెంతకు చేర్చుతామని పోలీసులు తెలిపారు.  


అత్యంత రద్దీ ప్రదేశాలకు వచ్చిన సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. దీనిపై టీటీడీ(TTD) అధికారులు సైతం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆలయ ఆవరణలో అనుమానితులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.


 


Also read:Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్‌ సేన్‌ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!


Also read:Google banned: మోసపూరిత యాప్‌లపై ఇక చెక్‌యేనా..గూగుల్ కీలక నిర్ణయం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook