brave solider havildar v subbaiah killed after saved 30 jawans: జమ్ము కశ్మీర్ లో విధినిర్వహణలో.. ఏపీలోని ప్రకాశం జిల్లా.. రావిపాడు కు చెందిన సుబ్బయ్య అమరుడైనట్లు తెలుస్తొంది.  ఆయన చనిపోక ముందు దాదాపు.. 30 మంది తోటి సైనికుల ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తొంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో కాపలా కాస్తున్నారు. ఈక్రమంలోనే సుబ్బయ్య అనుకోకుండా ల్యాండ్ మైన్ ఉచ్చులో పడిపోయారు. విషయం గుర్తించిన అతడు భయపడకుండా.. తన తోటి జవాన్ల ప్రాణాలు కాపాడాలని ప్లాన్ వేశాడు. ఈ విషయాన్ని అందరికి చెప్పి అలర్ట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఈ క్రమంలోనే 30 మంది అక్కడి నుంచి బైటకు వెళ్లారు. కానీ సుబ్బయ్య మాత్రం.. ల్యాండ్ మైన్ పేలడంతో అమరుడైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు.. సుబ్బయ్య కుటుంబానికి ఘటన గురించి చెప్పినట్లు తెలుస్తొంది.


మృతుడుకి భార్య లీలావతితో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.  30 మంది ప్రాణాలు కాపాడి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుసుకుని ఊరంతా సెల్యూట్ చేశారు. గురువారం రోజు సుబ్బయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. మరోవైపు మృతుడి కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.


Read more: AP SSC Exams Schedule 2025: ఏపీలో మార్చి 17 నుంచి ఏపీ టెన్త్‌ పరీక్షలు.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..


రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్


జమ్మూలో విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్  వరికుంట్ల సుబ్బయ్య మరణం పట్ల మాజీ సీఎం జగన్ సంతాపంవ్యక్తం చేశారు. సుబ్బయ్యను రియల్ హీరోగా అభివర్ణించారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి