Breaking News, Second Omicron Case in AP: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారతదేశంలోనూ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దేశంలో 200లకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలను విధిగా నిర్వహించి.. ప్రజలను క్వారంటైన్ తప్పనిసరిగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. ఇటీవలే కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల సదరు మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి ఆమె స్వస్థలమైన తిరుపతికి చేరుకుంది.  


తిరుపతి వెళ్లిన తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె ఇటీవలే విదేశాల నుంచి వచ్చిందని తెలుసుకున్న అధికారులు.. ఆమె నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్‌ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్‌ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 


అప్రమత్తమైన అధికారులు


అయితే ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం తొలి ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఇప్పుడు తిరుపతిలో మరో ఒమిక్రాన్ కేసు నమోదవ్వడం వల్ల ఆరోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ సోకిన వారిని వెంటనే ఐసోలేషన్ కు తరలిస్తూ.. తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు.   


Also Read: Cold Wave in Telangana: చలికి వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. కనిష్టంగా 4.6 డిగ్రీలు నమోదు


ALso Read: AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..డీఏ విడుదల చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి