Cold Wave in Telangana: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉదయం పూట కూడా ఇంటిని వదిలి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత మొదలవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన క్రమంలో దీంతో మన్యంలో చలి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో లంబసింగిలో సున్న డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పాడేరు, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మినుములూరులో 8 డిగ్రీలు నమోదైంది.
తెలంగాణలోనూ విపరీతమైన చలి..
మరోవైపు తెలంగాణలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే చలితో వణికిపోతోంది. కొమురం భీమ్ జిల్లా గిన్నెధరిలో 4.6గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేలలో 5.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 6.1, వాంకిడిలో 6.11, బజార్ హత్నూర్‌లో 6.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, మరో ఐదు రోజుల పాటు కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
Also Read: Winter Effect: రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న చలి తీవ్రత
Also Read: Home guards salary hike: తెలంగాణ హోంగార్డులకు గుడ్ న్యూస్-30 శాతం వేతనం పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి