Breaking News: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు
First Omicron Case in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు (Omicron Case in AP) బయటపడింది. ఇటీవలే ఐర్లాండ్ నుంచి వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో పాజిటివ్ గా తేలింది. అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ పంపించగా.. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు (Andhra Pradesh Corona Cases) స్పష్టమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని అధికారులు అప్రమత్తమయ్యారు.
First Omicron Case in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తొలి ఒమిక్రాన్ వైరస్ కేసు (Omicron Case in AP) విజయనగరంలో నమోదయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు (Andhra Pradesh Corona Cases) వెల్లడించింది.
ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా వైజాగ్ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అనుమానంతో అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపగా.. అతడు ఒమిక్రాన్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు కావడం గమనార్హం.
అయితే అతడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పిన అధికారులు.. ముందు జాగ్రత్తగా ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన (Andhra Pradesh Corona Cases) కారణంగా అధికారులంతా అప్రమత్తమయ్యారు. అనేక చోట్ల ముందస్తు జాగ్రత్త చర్యలు నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron Case in AP) సోకిన వ్యక్తికి కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉన్న వారికీ.. కరోనా పరీక్షలను అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం వాటి రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు.
Also Read: AP Corona cases: ఏపీలో స్థిరంగా కరోనా కేసులు- రాష్ట్రంలో భారీగా కొవిడ్ టెస్టులు!
Also Read: Lance Naik Sai Teja's Body : బెంగళూరుకు చేరిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook