Andhra Bride travels in a boat to reach Groom House: గత వారం రోజులుగా దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు నదులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఈ క్రమంలోనే కోనసీమలోని ఓ వధువు.. వరుడి వద్దకు చేరేందుకు కష్టాలు పడాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలోని అప్పన్నపల్లిలో వధువు ప్రశాంతి పెళ్లికి వరద నీరు అడ్డంకిగా మారింది. కేశనపల్లికి చెందిన వరుడు అశోక్‌కు ఇచ్చి ప్రశాంతి పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఆగస్టు నెలలో వర్షాలు పడతాయని భావించి.. జూలైలోనే ముహూర్తం పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ముందుగానే వర్షాలు కురవడంతో.. గోదావరి నదికి వరదలు పోటెత్తింది. దాంతో కోనసీమ ప్రాంతంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. ఇందులో అప్పన్నపల్లి కూడా ఉంది. 



ముహూర్తంకు సమయం దగ్గరపడుతున్నా కూడా భారీగా వరదలు రావడంతో ముందుగా నిర్ణయించుకున్న చోట పెళ్లి జరగడానికి వీల్లేకుండా పోయింది. దాంతో ఎలాగైనా పెళ్లి జరిపించాలని వధూవరుడి కుటుంబ సభ్యులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వరుడు ఇంటి వద్ద వివాహం చేయడానికి నిర్ణయించారు. దాంతో పెళ్లి కూతురు ప్రశాంతిని పట్టు చీర, ఆభరణాలతో ముస్తాబు చేసి.. పడవలో వరుడు ఇంటికి తీసుకెళ్ళారు. ప్రశాంతితో పాటు బంధువులు కూడా పడవల్లో ప్రయాణించి వెళ్లారు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం అశోక్‌, ప్రశాంతి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. 


Also Read: అద్దంలో తనను తాను చూసుకుని.. ఈ ఎలుగుబంటి ఏం చేసిందో చుడండి! నవ్వు ఆపుకోలేరు


Also Read: Agent Movie Teaser: బూతులతో మోత మోగించిన అఖిల్.. స్టైలిష్ అవతార్ లో ఏజెంట్


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.