జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో బహుజన సమాజ్ పార్టీ నేతలు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉత్తర ప్రదేశ్ బీఎస్పీ రాజ్యసభ సభ్యులు శ్రీ వీర్ సింగ్‌తో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సమన్వయకర్త శ్రీ గౌరీ ప్రసాద్ ఉపాసక్, బీఎస్పీ తెలంగాణ విభాగం నేత శ్రీ బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన, బీఎస్పీ నేతల మధ్య ఆంధప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన హామీ చట్టంలో పేర్కొన్న అంశాలు కూడా చర్చకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చిచ్చు రగులుతుందన్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఈ మధ్యకాలంలో అమిత్ షాకు మాయావతి లేఖ రాస్తూ.. తెలుగుదేశం పార్టీతో సహా ఎన్డీఏకు మిత్రపక్షాలన్నీ ఎందుకు దూరమవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో జనసేన పార్టీతో బీఎస్పీ పార్టీ నేతలు చర్చలు జరపడం ఓ ఆసక్తికర పరిణామం. జాతీయ రాజకీయాల్లో పవన్ పాత్ర ఏంటన్న విషయంపై కూడా భిన్న స్వరాలు తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంది.