ఏపీ టూరిజాన్ని కరుణించని బడ్జెట్..!
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. అందుకోసం కేంద్రం నుండి నిధులను పొందాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురే ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని.. అందుకోసం కేంద్రం నుండి నిధులను పొందాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురే ఎదురైంది. ముఖ్యంగా విశాఖపట్నంలోని అరకువేలీ అభివృద్ధికి గతంలో రూ.198 కోట్లతో ప్లానింగ్ వేసిన ప్రభుత్వం.. అందులో 100 కోట్లు కేంద్రం ద్వారా పొందాలని భావించింది.
అలాగే శ్రీకాకుళంలోని కళింగపట్నంలో రూ.200 కోట్లతో బీచ్ రిసార్ట్ ప్రారంభించాలని.. అందుకోసం కూడా కేంద్ర సహాయం ఉంటే బాగుంటుందని రాష్ట్రం భావించింది. అలాగే గండికోటకు సంబంధించి రోప్ వే ప్రాజెక్టు కూడా పెండింగ్‌లోనే ఉంది.
ఐఎన్‌ఎస్ విరాట్ నౌకలో 148 గదుల హోటల్‌ను ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ఆలోచనకు కూడా భంగం ఏర్పడింది. ఇవ్వన్నీ నెరవేరాలంటే కేంద్రం కూడా సహకరించాలి కదా. కానీ ఈ బడ్జెట్‌లో టూరిజానికి సంబంధించి పెద్దగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి నిరాశే మిగిలింది అంటున్నారు కొందరు రాజకీయవేత్తలు