AP Railway Budget Allocation: దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యంతర బడ్జెట్ ఊసురుమనిపించింది. ఎన్నికల సంవత్సరం కావడంతో వరాల వర్షం కురుస్తుందని భావిస్తే.. ఎలాంటి జనాకర్షక ప్రకటనలు చేయలేదు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత పదేళ్లలో జరిగిన కేటాయింపులు, అమలు చేసిన పథకాలే తమ విజయానికి బాటలు పరుస్తాయంటూ ప్రకటించారే తప్పా.. కొత్త పథకాల ప్రకటన గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. పీఎం కిసాన్ సాయం పెంపు, ఉద్యోగులకు ఇన్‌కమ్ ట్యాక్స్ భారం తగ్గింపు, ఆయూష్మాన్ బీమా కవరేజీ పెంపు ఉంటుందని అందరూ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అమరావతి రైల్వే లైన్‌కు కేవలం రూ.వెయ్యి కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ రూ.2,679 కోట్ల వ్యయం అంచనా మొదలవ్వగా.. గత ఐదేళ్లలో కేవలం 2.20 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఆ డబ్బులు కూడా సర్వేల కోసమే ఉపయోగించారు. ఈ బడ్జెట్‌లో కూడా కేవలం రూ.1000 కేటాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కేంద్రానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఉద్దేశం ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ లైన్‌తోపాటు గతంలో మంజూరైన ఇతర లైన్లకు కూడా రూ.వెయ్యి నుంచి మొదలు.. అత్యధికంగా రూ.10 లక్షలు వరకు మాత్రమే ప్రకటించారు. 


విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ కార్యాలయాలు, ఇతర కార్యాకలపాలు మొదలు పెడతామని ప్రకటించగా.. అందుకు రూ.170 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఇందుకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.9 కోట్లు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్ట్‌లో కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడిగా నిధులు ఇవ్వడం.. ఎక్కువ ప్రాజెక్ట్‌లకు మొండి చేయి చూపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని డివిజన్లకు కలిపి బడ్జెట్‌లో రూ.9,138 కోట్లు ఇస్తామన్నారు.


కర్నూలులోని వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రం పదేళ్ల క్రితం మంజూరైనా.. పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో రూ.115 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కాకినాడ నుంచి పిఠాపురం, మాచర్ల నుంచి నల్గొండ, కంభం నుంచి ప్రొద్దుటూరు, గూడూరు నుంచి దుగరాజపట్నం రైల్వే లైన్లకు కేవలం రూ.1000 చొప్పున బడ్జెట్‌లో కేటాయించారు. కొండపల్లి నుంచి కొత్తగూడెం, భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్లకు రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు. మరికొన్ని ప్రాజెక్ట్‌లకు అసలు కేటాయింపులు కూడా జరగలేదు.


Also Read: IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు


Also Read: Telangana Jobs: నిరుద్యోగుల్లారా మీకు నేనున్నా.. కేసీఆర్‌లా కాదు 2 లక్షల ఉద్యోగాలిస్తా: రేవంత్‌ రెడ్డి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter