Kalki collection worldwide: ‘కల్కి 2898 AD’ మూవీ నాల్గో రోజుల్లో వచ్చింది ఎంత.. ? హిట్ స్టేటస్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే..!

Kalki 4 Days WW Box Office Collections: ‘కల్కి 2898 AD’ మూవీ ఇంతింతై అన్నట్టు సరైన ప్రమోషన్స్ లేకున్నా.. భారతీయ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. 2024లో మొదటి రోజు మన దేశంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ సినిమా నిన్నటితో 4వ రోజు పూర్తి చేసుకుంది. మొత్తంగా 4 డేస్ లో ఈ సినిమాకు వచ్చింది ఎంత ? హిట్ స్టేటస్ కు ఎంత రాబట్టాలంటే..  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 1, 2024, 03:37 PM IST
Kalki collection worldwide: ‘కల్కి 2898 AD’ మూవీ నాల్గో రోజుల్లో వచ్చింది ఎంత.. ? హిట్ స్టేటస్ కు ఇంకా ఎంత రాబట్టాలంటే..!

Kalki 4 Days WW Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే వంటి వారు తమ పరిధి మేరకు కథానుగుణంగా నటించి మెప్పించారు. ప్రభాస్ ఈ సినిమాలో కర్ణుడిగా, భైరవగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. అటు అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ పరాకాయ ప్రవేశం చేశారు. యాస్కిన్ సుప్రీమ్ పాత్రలో కమల్ హాసన్ ఉన్నది కాసేపు అయినా.. తన క్యారెక్టర్ తో ఒదిగిపోయారు. అంతేకాదు మాములు కమర్షియల్ సినిమాల్లో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ అనేది కామన్. ఇందులో అలాంటేవి లేకుండా తనదైన శైలిలో మెప్పించారు.

ఈ సినిమా నాల్గు రోజుల్లో దాదాపు రూ. 280 కోట్ల షేర్  (రూ. 555 కోట్ల) గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఈ సినిమా రూ. 370 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ఇంకా రూ. 92 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం ఉన్న ఊపు కొనసాగితే.. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం పెద్ద విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 120 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక హిందీ బెల్ట్ లో ఈ సినిమా దాదాపు రూ. 115 కోట్ల నెట్  బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. ఈ రోజు సోమవారం వర్కింగ్ డే స్ కాబట్టి.. కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించే అవకాశాలున్నాయి. మరోవైపు టికెట్ రేట్స్ తగ్గిస్తే.. ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter.

Trending News