Heavy rain floods in Vijayawada: భారీ వర్షాలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.ఈ నేపథ్యంలో రోడ్లన్ని జలమయమైపోయాయి. చెరువులు, ప్రాజెక్టులున్ని నిండుకుండలా మారిపోయాయి. రోడ్ల మీద ఎక్కడ చూసి నీళ్లు మాత్రమే కన్పిస్తున్నాయి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ప్రజలు బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. అధికారులు కూడా అత్యవసరమైతేనే బైటకు రావాలని కూడా ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఏపీలో విజయవాడ, గుంటూరులో భారీగా వర్షంకురుస్తుంది. అక్కడి రోడ్లన్ని జలమయమైపోయాయి. ఏపీలో వర్షాల వల్ల ఒకే రోజు ఏడుగురు చనిపోయారు. విజయవాడలో కొండ చరియలు విరిగి పడి నలుగురు మరణించారు.


అదే విధంగా గుంటూరులో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. విజయవాడ, హైదరాబాద్ రోడ్లన్ని జలమయమైపోయాయి. బస్టాండ్ కూడా నడుములోతు వరకు నీళ్లు వచ్చేశారు. బెజ వాడ పూర్తిగా జలదిగ్భందంలో ఉందని చెప్పవచ్చు.ఎక్కడ చూసిన కూడా నీళ్లే కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కొంత మంది యువకులు నీళ్లలో కొట్టుకుని పోతున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.


 




విజయవాడలో భారీగా వరద పొటెత్తింది. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడచూసిన కూడా నీళ్లు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. జనాలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఇళ్లలోనికి కూడా భారీగా నీళ్లు వచ్చిచేరుతున్నాయి. ఈ నేపథ్యంలో బెజవాలో స్థానికంగా వరద భీకరంగా ప్రవహిస్తుంది.


Read more: Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్..  సెలవులపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..


ఆ ప్రవాహాంలో ఒక బైకర్  కూడా కొట్టుకుని వస్తుండగా స్థానికులు కాపాడారు.  అంతేకాకుండా.. నూజీవీడు మండలం వెంకటాయ పాలెంలో కూడా వరద దాటుతుండగా.. ఒకవ్యక్తి కొట్టుకుని పోయాడు. కానీ అతని లక్ బాగుండటం వల్ల.. అక్కడ చెట్లును పట్టుకొగా.. స్థానికులు కాపాడారు.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.