Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Heavy rains in Telangana: తెలంగాణలో కుండపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
 

1 /6

రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా వానలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. ఎక్కడ చూసిన రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. జనాలు ఇంటి నుంచి బైటకు వెళ్లలేక వణికిపోతున్నారు.  వర్షాల వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

2 /6

శుక్రవారం అర్థారాత్రి నుంచి వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి కూడా ఎడతెరిపిలేకుండా కురుస్తునే ఉంది. వర్షాల వల్ల ఇప్పటికే ఏపీలో ఏడుగురు మరణించారు. అంతేకాకుండా... అనేక వాహానాలు నీళ్లలో కొట్టుకునిపోయాయి. 

3 /6

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది.   

4 /6

వాతావరణ శాఖ అలర్ట్ తో తెలంగాణ సర్కారు రంగంలోకి దిగింది. తెలంగాణ సీఎం శాంతి కుమారీ.. అన్నిజిల్లాల కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాని సూచించారు. అంతేకాకుండా.. వర్షాలపై ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి అప్ డేట్ ఇవ్వాలని కూడా తెలిపారు.   

5 /6

అంతేకాకుండా.. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో..అవసరమైన చోట కంట్రోల్ రూమ్ లు సైతం ఏర్పాటు చేయాలని, వాగులు, చెరువులు, ప్రాజెక్టులు ఉన్న ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

6 /6

ముఖ్యంగా స్కూళ్లకు సెలవుల విషయంలో కూడా సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితును బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు.. నిర్ణయం తీసుకొవాలని కూడా సూచించారు. ప్రతి నిముషం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గుకుండా.. ముందు జాగ్రత్తలు తీసుకొవాలని కూడా సూచనలు జారీ చేశారు.