హైదరాబాద్: తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందని అన్నారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్‌గా అందరికి గుర్తుండిపోయిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీ నారాయణ. ఏదైనా ఒక వ్యవస్థను మార్చడానికి ఒక చిన్న విప్లవం సరిపోదు. రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు, చేసే చట్టాలపైనే ఏదైనా వ్యవస్థ ఆధారపడి ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకునే చోటు, చట్టాలు జరిగే చోట విస్తృతస్థాయిలో మార్పు తీసుకువస్తేనే సమాజం, వ్యవస్థలో మార్పు తీసుకురాగలం అనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. 


ఇటీవలే తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన అయితే చేశాను కానీ.. మొదటి అడుగు ఎలా వేయాలనేదానిపైనే ఇంకా సమీక్ష చేసుకుంటున్నానని లక్ష్మీ నారాయణ తెలిపారు.