AP Three Capital Issue: ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే(Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆయన ఈ కామెంట్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రవిభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సిందని అథవాలే అన్నారు. అయితే అప్పటి యూపీఏ సర్కారు ఈ అంశాలను విస్మరించిందని కేంద్రమంత్రి ఆరోపించారు. అందుకే అమరావతి పనులు ఆగిపోయాయని ఆయన అన్నారు. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చే అంశాన్ని మోదీ సర్కారు పరిశీలిస్తోందని ఆయన అన్నారు. 


ప్రస్తుతం జగన్  సర్కారు మూడు రాజధానులు (AP Three Capital Issue) అంటోందని.. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావడం లేదన్నారు అథవాలే. మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలని ఆయన ప్రశ్నించారు. 


Also Read: AP Special Status: ప్రత్యేక హోదాపై చర్చకు ఏపీకు ఆహ్వానం, త్వరలో హోదా రానుందా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook