AP Special Status: ప్రత్యేక హోదాపై చర్చకు ఏపీకు ఆహ్వానం, త్వరలో హోదా రానుందా..??

AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక హోదా సిద్దించే సూచనలు కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయమే దీనికి ఉదాహరణ అంటున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2022, 01:05 PM IST
AP Special Status: ప్రత్యేక హోదాపై చర్చకు ఏపీకు ఆహ్వానం, త్వరలో హోదా రానుందా..??

AP Special Status: ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం, రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. ప్రత్యేక హోదా సిద్దించే సూచనలు కన్పిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయమే దీనికి ఉదాహరణ అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో నాటి పాలకులు ఏపీకు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే కార్యరూపం దాల్చలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం హామీకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఎంచుకోవడంతో అది కాస్తా మూలనపడింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నుంచి మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా అంశం చర్చకు ఉంది. వైసీపీ నేతలు ముఖ్యంగా ఎంపీలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే ఈ అంశంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏపీకు ప్రత్యేక హోదా త్వరలో రానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయమే.

కేంద్ర హోంశాఖ తాజాగా ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఈ నెల 17వ తేదీన రావాలని రాష్ట్రానికి ఆహ్వానం పంపింది. కేంద్ర జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఏపీ, తెలంగాణ ఉన్నతాదికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. త్రిసభ్య కమిటీకు ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావులు పాల్గొంటారు. ఫిబ్రవరి 17వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9 ప్రధాన అంశాలపై చర్చ జరగనుంది. 

ఈ చర్చల్లో ప్రధానంగా 9 ఎజెండాలున్నాయి. ఇందులో ఏపీ స్టైట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ-తెలంగాణ విద్యుత్ వినియోగ సమస్య పరిష్కారం, పన్ను అంశాలపై వివాదాల పరిష్కారం,  రెండు రాష్ట్రాల బ్యాంకు నగదు, డిపాజిట్లు, ఏపీఎస్‌సీ‌ఎస్సీ‌సీ‌ఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్ మద్య నగదు ఖాతాల విభజన, ఏపీ-తెలంగాణ మధ్య వనరుల పంపిణీ, ఉత్తరాంధ్ర-రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు, ఏపీ ప్రత్యేక హోదా(Ap Special Status), రెండు రాష్ట్రాల పన్ను రాయితీలు ఉన్నాయి.

Also read: AP New Districts: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News