AP Oxygen Status: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఏపీకు ఆక్సిజన్ కేటాయింపుపై స్పష్టత వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి దేశం కుదేలవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా మారుతోంది. ఆక్సిజన్ అందక ( Oxygen Shortage) ఆసుపత్రుల్లో ఐసీయూల్లో ఉన్న రోగులు ప్రాణాలు వదులుతున్నారు. మరోవైపు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల (Remdesivir injections) కొరత వేధిస్తోంది. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆక్సిజన్ కేటాయింపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు.


కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని..ఆక్సిజన్, ఔష‌ధాలు, వ్యాక్సిన్ల కేటాయింపులు చేస్తోంద‌ని సోము వీర్రాజు (Somu veerraju) చెప్పారు. ఏపీ (AP)కి కేంద్ర ప్రభుత్వం ( Central government)తరపున రావల్సిన వాటాను స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని వివ‌రిస్తూ ట్వీట్లు చేశారు. కొవిడ్ రక్షణ చర్యలలో భాగంగా రాష్ట్రానికి రోజుకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను, 73 వేల డోసుల రెమిడెసివర్ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే మే నెల తొలి 15 రోజుల కాలానికి రాష్ట్రానికి 9 లక్షల 17 వేల 850 వ్యాక్సిన్ డోసులను కేటాయించారని సోము వీర్రాజు చెప్పారు. పరిస్థితులను బట్టి మరింత ఎక్కువగా వ్యాక్సిన్ల కేటాయింపులను జరిపి వీలయినంత త్వరగా ప్రజలందరి సహకారంతో కరోనాను జయించటానికి కృషి చేస్తామన్నారు.


Also read: Tirupati Bypoll Results Live Updates: తిరుపతి ఉపఎన్నిక ఫలితాల్లో అధికార పార్టీ హవా, భారీ మెజార్టీ దిశగా వైసీపీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook