విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ..లేకపోతే మూసివేతే : కేంద్ర ప్రభుత్వం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వైఖరిని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పెట్టుకున్న ఆశల్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవల్సిందే. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని తెలుస్తోంది.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వైఖరిని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పెట్టుకున్న ఆశల్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవల్సిందే. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని తెలుస్తోంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్(Vizag steel plant) విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా వైఖరితో ఆందోళన మరింత పెరిగే ప్రమాదం కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తాజా వైఖరి కారణంగా ఏపీ ప్రజలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పెట్టుకున్న ఆశల్ని ఇకపై వదులుకోవల్సిందేనని తెలుస్తోంది. ఓ వైపు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు(Visakha steel plant privatisation) వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుండగానే..పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పదే పదే ఈ వ్యవహారంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి వాటా ఉపసంహరణ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ(Ap cm ys jagan) రాసిన సంగతిని ప్రస్తావిస్తూ వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం స్టీల్‌ప్లాంట్ వ్యవహారంపై ఆందోళనను పెంచేదిగా ఉంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థల్ని సాధ్యమైతే ప్రైవేటీకరించడం లేనిపక్షంలో శాశ్వతంగా ముూసివేయడమే కొత్త పబ్లిక్ సెక్టార్ విధానమని కేంద్రం(Central government)స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు నుంచి వందశాతం వాటాను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి 27వ తేదీన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేదే లేదని వెల్లడించింది.
Also read: పెగసస్ స్పైవేర్, కొత్త సాగుచట్టాలపై పార్లమెంట్‌లో కొనసాగుతున్న ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook