ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ అవసరం లేదు...ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరీ స్పష్టం ప్రకటించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కు ఆధార్‌ కార్డును ఉపయోగించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని రాజ్యసభలో ప్రశ్నోత్తాల సమయంలో ఈ విషయాన్ని  వెల్లడించారు. ఆర్టీఓల దగ్గర బయోమెట్రిక్ సేకరణ ప్రక్రియ నిలిపివేయబడిందని గడ్కరీ వివరించారు. గత ఏడాది సెప్టెంబర్‌ 26న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని రవాణాశాఖ గడ్కరీ సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆధార్‌ కార్డు ఆధారంగా కోటిన్నరకు  (  1,57,93,259 )  పైగా డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ చేశారు. ఇదే సమయంలో ఆధార్ ప్రామాణికంగా 1.65 కోట్ల వాహనాలను రిజిస్టర్‌ చేశారు. తాజా నిర్ణయంతో ఇక నుంచి ఆధార్ అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్సుల ప్రక్రియ కొనసాగనుంది. 


డ్రైవింగ్‌ లైసెన్స్‌ కు కనీసం 8వ తరగతి నిబంధనను ఎత్తివేయబోతున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసేముందు ధ్రువీకరణకు ఆధార్‌ కార్డును ఉపయోగించడాన్ని రద్దు చేయడం గమనార్హం. తాజా నిర్ణయాల  పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ తీసుకున్న నిర్ణయాలతో లైసెన్సుల జారీ ప్రక్రియ మరింత సులభతరతుందని... లైసెన్సుల నమోదు మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.