Central On Maoist: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ రోజు జరిగే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌, ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నట్టు సమాచారం.
 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరివేత, తాజా పరిస్థితులు, అభివృద్ధి ఇతర అంశాలపై చర్చించనున్నారు‌‌‌‌‌‌.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నక్సల్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ కగార్ లో నక్సల్ ను ఏరివేత లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల అభివృద్దికి నక్సల్ పెద్ద అడ్డుగోడగా నిలిచారు. అంతేకాదు ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మావోలు అడ్డుకుంటున్నారనే వాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అంతేకాదు మారుమూల గిరిజన ప్రాంతాల్లోని  యువకులను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. వారి దళంలో చేరకపోతే కుటుంబ సభ్యులను ఊచకోత కోస్తారనే భయంతో కొంత మంది గిరిజనులు, స్థానికులు బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేరుతున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా మావో సిద్దాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం.  


 కాగా, 2026 మార్చి నాటికి భారత్ ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామని ఇటీవల హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ దిశలో గత పదేళ్లలో నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లను కేంద్రం చేపట్టింది. అలాగే యువత, కొత్తవారు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా లెక్కలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. గడిచిన 280 రోజుల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో 202 మంది నక్సల్స్ మృతిచెందారని ప్రకటించింది. అలాగే ఈ ఏడాది 723 మంది మావోయిస్టులు లొంగిపోగా, 812 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇక 2010తో పోల్చితే మావోయిస్టులు చేపట్టిన హింసాత్మక ఘటనలు72 శాతం మేరకు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. హింస కారణంగా చనిపోయినవారి సంఖ్య కూడా 86 శాతం తగ్గిందని కేంద్రం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కి.మీ. పొడవైన రోడ్లతోపాటు 6,000 మొబైల్ టవర్లు నిర్మించినట్టు వివరించింది.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter