చెన్నై: సేవ్ కంట్రీ - సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో బీజేపీకి వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగుపడింది. ఈ కమ్రంలో  చంద్రబాబు డీఎంకే చీఫ్ స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న అన్యాయంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా దక్షిణాదిలో బీజేపీ బలపడకుండా అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక దక్షిణాది ఫార్ములా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలో కామన్ ఎజెండాతో నడవాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశంలో డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్‌ బాలు పాల్గొన్నారు. చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్ర వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాబు వ్యూహానికి అనూహ్య స్పందన


బీజేపేతర పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు వ్యూహానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికీ కాంగ్రెస్ తో పాటు బీజేపీని వ్యతిరేకించే పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన చంద్రబాబును ఆయా పార్టీలకు చెందిన నేతలు అభింనందించారు. ఈ క్రమంలో గురువారం మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామిల మద్దతు తీసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు తాజా డీఎంకే చీప్ స్టాలిన్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాలకు స్థాలిన్ కూడా మద్దతు తెలిపారు. బీజేపీకి వ్యతిరేక పోరాటంలో చంద్రబాబుతో కలిసి నడుస్తామని  ఈ సందర్భంగా ప్రకటించారు. 


రేపు బాబుతో రాహుల్ దూత భేటీ


ఇదిలా ఉండగా శనివారం మధ్యాహ్నం అమరావతికి కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ రానున్నారు. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబుతో గెహ్లాట్‌ భేటీ అవుతారు. రాహుల్‌ దూతగా చంద్రబాబుతో ఆయన సమావేశంకానున్నారు. బీజేపీని బలపడకుండా అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యహంతో పాటు భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై చర్చించనున్నారు.